ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవడని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడలేకపోయెను.అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూ